‘డీజే టిల్లు’ చిత్రంలో హీరోగా తన నటనతో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ వాయిస్‌కు అభిమానులు వున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇప్పుడు సిద్ధు తన వాయిస్‌ఓవర్‌తో ‘భాగ్ సాలే’ చిత్ర నేపథ్యాన్ని ప్రేక్షకులకు చెప్పబోతున్నాడు. కథలో హీరో ఎందుకు ఛేజింగ్ చేస్తున్నాడు. దాని వెనకున్న కారణాలు సిద్ధు వాయిస్ ఓవర్లో ఆసక్తికరంగా చెప్పబోతున్నాడు.
శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘భాగ్ సాలే’ ఈ చిత్రానికి సిద్ధు వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణ కాబోతుంది.ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు.జూలై 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.