Kohinoor Part 1 | ఈ ఏడాది టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. టిల్లు సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం మార్చి 29న విడుదలై మంచి విజయం సాధించడమే కాకుండా రూ.135 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్ ఫార్చ్యూన్4సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ నిర్మించాడు. అయితే ఈ మూవీ తర్వాత మళ్లీ సిద్దు జొన్నలగడ్డ సితార ఎంటర్టైనమెంట్స్ కలిసి మరో క్రేజీ ప్రాజెక్ట్ను చేయబోతున్నాయి.
క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా, బబుల్గమ్ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు (Ravikanth Perepu) తన తర్వాతి ప్రాజెక్ట్ను సిద్దు జొన్నలగడ్డతో చేయబోతున్నాడు. కోహినుర్ పార్ట్ 1 (Kohinoor – Part 1) అంటూ ఈ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2026లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రబృందం దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. మోషన్ పోస్టర్ను విడుదల చేసింది. భద్రకాళి అమ్మవారిని పోస్టర్ను చూపిస్తూ.. మాస్ లుక్లో అలరిస్తున్నాడు స్టార్ బాయ్. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్ ఫార్చ్యూన్4సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
We have been patient for around 1000 years to claim what rightfully belongs to us 💎
Behold, the KING will bring back the glory of Goddess Bhadrakali 🙏 #HappyDussehra everyone ❤️🔥
Presenting you our dearest Starboy 🌟 #Siddu in #Kohinoor – Part 1 ~ In Cinemas January 2026 🤩… pic.twitter.com/rSXkfzqt57
— YouWe Media (@MediaYouwe) October 12, 2024