Tillu Square | టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న తాజా చిత్రం టిల్లు 2 (Tillu Square). డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సిద్దు జొన్నలగడ్డకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. టిల్లు 2 గ్లింప్స్‌ను షేర్ చేశారు మేకర్స్. సిద్దు, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీ రైడ్ సీన్‌తో షురూ అయింది గ్లింప్స్. టిల్లుకు బర్త్ డే విషెస్ చెప్పిన హీరోయిన్.. గతేడాది నీ పుట్టినరోజు నువ్వెక్కడున్నావ్ అని అడుగుతుంది. ఆ తర్వాత ఫస్ట్ పార్టు సీన్లను మరోసారి చూడొచ్చు.
మేం మా ఫ్రెండ్స్ అంతా కలిసి సినిమా చూసినం. నల్లమల ఫారెస్ట్.. నల్లచీర..ఏ ఫిలిం బై రాధిక.. ఏవో పాత జ్ఞాపకాలు నావి.. పాతయే గానీ తీపియైతే కావు.. అంటూ సిద్దు తనదైన స్టైల్లో చెబుతున్న డైలాగ్స్ ఇంప్రెసివ్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మేకర్స్ చాలా రోజు క్రితం సిద్దు జొన్నల గడ్డ, అనుపమ పరమేశ్వరన్ ట్యాక్సీలో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న పోస్టర్ ఒకటి లాంఛ్ చేయగా.. ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. నో క్యాప్షన్.. ఓన్లీ యాక్షన్.. 2024 మార్చి 29లో టిల్లు 2 మీ దగ్గరలోని థియేటర్లలో సందడి చేయనుంది.. అంటూ రిలీజ్ చేసిన హాట్ లుక్‌లో సిద్దు, అనుపమను ఎత్తుకుని కనిపిస్తూ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు.
టిల్లు 2 నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన ఫన్ ట్రాక్ వీడియోతోపాటు టికెటే కొనకుండా పాటలకు మంచి స్పందన వస్తోంది. డీజే టిల్లుతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సిద్దు జొన్నల గడ్డ ఈ సారి టిల్లు 2లో టైటిల్‌కు తగ్గట్టుగా డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందించబోతున్నట్టు ఇప్పటివరకు రిలీజ్ చేసిన రషెస్‌తో క్లారిటీ ఇచ్చేస్తున్నారు మేకర్స్.
సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌తో అసోసియేట్ అవుతూ నిర్మిస్తోన్న ఈ మూవీకి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, ప్రణీత్ రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టిల్లు 2 హాట్ లుక్..
No caption, Only action! In Theatres all around you from 29th March 2024 🤩#TilluSquareOnMarch29th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @adityamusic pic.twitter.com/NoeqWCtvBx
— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2024
Attention Everybody! 🔊
Dropping a MAJOR update from our #TilluSquare tomorrow at 11:07am! 😎
Stay tuned & DON’T MISS IT! 🤩🕺#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios… pic.twitter.com/uhGDO8D5tK
— BA Raju’s Team (@baraju_SuperHit) October 26, 2023
టికెటే కొనకుండా సాంగ్..
టికెటే కొనకుండా ప్రోమో..
టిల్లు 2 ఫన్ ట్రాక్ వీడియో..