Siddhu Jonnalagadda | యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda). ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తెలుసు కదా(Telusu Kada). ఈ సినిమాకు పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్‌ను వదిలారు మేకర్స్. ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా కథానాయికలుగా నటించబోతున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి యువరాజ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.