సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘జాక్’ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా విషయంలో నిర్మాతలు భారీగా నష్టపోవడంతో తాను తీసుకున్న పారితోషికంలో సగం ప్రొడ్యూసర్స్‌కు తిరిగిచ్చేశాడట హీరో సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో బాగా ప్రచారమవుతున్నది.
‘జాక్’ సినిమాకు సిద్ధు 9కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని, అందులో నాలుగుకోట్ల వరకు వాపస్ చేశారని టాక్. సిద్ధు సహృదయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి చర్యలు నిర్మాతలకు ఊరటనిస్తాయని అంటున్నారు. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’ చిత్రంలో నటిస్తున్నారు. నీరజ కోన దర్శకురాలు. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది.