Jack Review | ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ సినిమాలతో స్టార్ లీగ్ లోకి చేరాడు సిద్దు జొన్నలగడ్డ. ‘బొమ్మరిల్లు’ లాంటి క్లాసిక్ ఫిల్మ్ తీసి తనకంటూ ఒక మార్క్ వేసుకున్న దర్శకుడు భాస్కర్. బేబీ సినిమాతో యూత్ సెన్సేషన్ గా మారింది వైష్ణవి చైతన్య. ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జాక్. ‘టిల్లు స్క్వేర్’ తర్వాత సిద్ధు నుంచి వచ్చిన ఈ సినిమాపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి? మరి ఆ అంచనాలని సిద్దు అందుకున్నాడా? తన ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.
కథ గురించి: జాక్ అలియాస్ పాబ్లో నెరోడా (సిద్దు జొన్నలగడ్డ) చాలా తెలివైన కుర్రాడు. చిన్నప్పటి నుంచి ఏవోవో కావాలని కలలు కంటుంటాడు. కానీ ఏది కూడా రూల్ ప్రకారం చేయడు. తనకంటూ ఒక సేఫరేట్ స్టయిల్ పెట్టుకుంటాడు. తనకి సాధారణమైన పని చేయడం ఇష్టం వుండదు. ‘రా’ ఏజెంట్ కావాలని అనుకుంటాడు. ఇంటర్వ్యూకి వెళ్తాడు. అయితే జాబ్ వచ్చేలోపే దేశాన్ని కాపాడే ఓ మిషన్ లో భాగంగా ఉగ్రవాదులు వెంటపడతాడు. తీవ్రవాదిని వెదుక్కుంటూ నేపాల్ వెళ్తాడు. తర్వాత ఏం జరిగింది? ఈ కథలో మనోజ్ (ప్రకాష్ రాజ్), రెహ్మాన్ (రాహుల్ దేవ్), ఆప్షాన్ బేగం (వైష్ణవి చైతన్య) ఎవరు? చివరి జాక్ మిషన్ సక్సెస్ అయ్యిందా లేదా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఇప్పటివరకూ తీసిన ‘రా’ బ్యాక్ డ్రాప్ సినిమాలన్నీ సీరియస్ టోన్ లో సాగే థ్రిల్లర్స్. రా అంటేనే సీరియస్ నెస్. అయితే జాక్ ని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ట్రీట్ చేసిన విధానం మాత్రం సిల్లీ అనే ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. హీరో క్యారెక్టర్, కోర్ కథతో ఎమోషనల్ కనెక్షన్ వుండదు. దీంతో తెరపై జరుగుతున్న సంఘటనల్లో ఉత్కంఠత కొరవడింది. భాస్కర్ కి అంటూ ఒక మార్క్ వుంది. ఆయన క్రియేట్ చేసే పాత్రల్లో ఒక ఒరిజినాలిటీ వుంటుంది. ఇందులో అది మిస్ అయ్యింది. జాక్ క్యారెక్టర్ లో చాలా వరకూ టిల్లునే కనిపిస్తాడు. ఒక విధంగా అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. కథలో పెద్ద బలం లేకపోయినా సిద్దు తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో లాకొచ్చాడు. ఇందులో టిల్లు రిఫరెన్స్ లు వున్నాయి. అవి కొంత వర్క్ అవుట్ అయ్యాయి. నేపాల్ ఎపిసోడ్ పండలేదు. క్లైమాక్స్ లో చేసిన ఫైట్ మాత్రం సిద్దులో ఓ మాస్ హీరోని చూపించేలా వుంటుంది.
నటీనటులు నటన: సిద్దు స్టైల్, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. వీక్ కథని కూడా తన పెర్ఫార్మెన్స్ తో మోసుకొచ్చాడు. వైష్ణవి చైతన్య అందంగా కనిపించింది కానీ ఆమె క్యారెక్టర్ కి పెద్ద ప్రాధాన్యత లేదు. పైగా సిద్దు, చైతన్య కెమిస్ట్రీ సహజంగా కుదరలేదు. ప్రకాష్ రాజ్ తన అనుభవం చూపించారు. మిగతా నటులు పరిధిమేర వున్నారు.
టెక్నికల్ గా: పాటలు చిత్రీకరణ బావుంది, నేపధ్య సంగీతం కూడా డీసెంట్ గా వుంది. కెమరా వర్క్ కి మంచి మార్కులు పడతాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తన మార్క్ కి భిన్నంగా ఓ స్పై థ్రిల్లర్ చేయాలనుకున్నాడు. అయితే కథ కధనంపై మరింత దృష్టి పెట్టివుంటే బావుండేది.
ప్లస్ పాయింట్స్
సిద్దు జొన్నల గడ్డ పెర్ఫార్మెన్స్
టిల్లులో కొన్ని రిఫరెన్స్ లు
మైనస్ పాయింట్స్
కథ, కథనం
వీక్ డైరెక్షన్
‘రా’ బ్యాక్ డ్రాప్ గ్రిప్పింగ్ గా లేకపోవడం
రేటింగ్ 2.5/5