Siddu Jonnalagadda | యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ తాజాగా నటిస్తున్న చిత్రం జాక్ (Jack Movie). బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మువీ నుంచి కిస్ అనే మెలోడి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సాంగ్ చూస్తుంటే.. వైష్ణవితో ముద్దుకోసం పిచ్చికుక్కలా తన వెంట తిరుగుతుంటాడు సిద్ధు. యుత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో కిస్ సాంగ్ ప్రత్యేకంగా నిలస్తుందని మేకర్స్ తెలిపారు. సనారే లిరిక్స్ అందించిన ఈ పాటను జావేద్ అలీ, అమల చేబోలు కలిసి పాడారు. భాస్కర్ కంపోజ్ చేసిన ఈ పాటకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.