Siddhu Jonnalagadda | నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘టిల్లు’ దూకుడు: సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ సిరీస్‌తో కొత్త అవతారం!
Siddhu Jonnalagadda | ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఈసారి యాక్షన్ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారట.
Siddhu Jonnalagadda | ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో యువతలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఈసారి యాక్షన్ వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారట. ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించనున్నట్లు సమాచారం. తన గ్లామర్‌తో పాటు నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి, ఈ ప్రాజెక్ట్‌లో డిఫరెంట్ రోల్లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ యాక్షన్ సిరీస్‌కు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ స్టార్ సూర్యతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తైన తర్వాత ఈ వెబ్ సిరీస్‌ను ట్రాక్‌పైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సిరీస్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పటికే సిద్ధు జొన్నలగడ్డ ‘గ్యాంగ్ స్టార్స్’ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయిన ఈ క్రైమ్ డ్రామా మంచి స్పందన అందుకుంది. ఈ సిరీస్‌లో జగపతి బాబు, శ్వేతా బసు ప్రసాద్, నవదీప్ కీలక పాత్రలు పోషించారు.
ఈ ప్రాజెక్ట్‌తో వెంకీ అట్లూరి , మీనాక్షి చౌదరి ఇద్దరికీ డిజిటల్ డెబ్యూ కావడం విశేషం. సిద్ధు, మీనాక్షి ఇద్దరూ ఇందులో పూర్తిగా భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ టేకింగ్‌తో రూపొందనున్న ఈ సిరీస్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టైటిల్, మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ‘టిల్లు’ ఇమేజ్ను దాటుకుని కొత్త అవతారంలో సిద్ధు ఎలా మెప్పిస్తాడో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

