Siddharth | సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘3బీహెచ్‌కే’. శ్రీగణేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. అరుణ్‌విశ్వ నిర్మాత. గురువారం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ‘ఇది మన ఇంటి కథ. ఈ ఇంట్లోనే చిన్న చిన్నగా చాలా కథలున్నాయి. ఇది మాసాల డబ్బా కాదు. అమ్మగారి చిన్న బ్యాంక్. ఇది నాన్నగారి సెంటిమెంట్ బీరువా’ అంటూ సిద్ధార్థ్ వాయిస్‌ఓవర్‌తో మొదలైన టీజర్ ఇంట్రెస్టింగ్గా సాగింది. శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమృత్ రామ్‌నాథ్, సంభాషణలు: రాకేందుమౌళి, రచన-దర్శకత్వం: శ్రీగణేష్.