Takkar | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ సిద్దార్థ్ (Siddharth). రీసెంట్గా డబ్బింగ్ సినిమా టక్కర్ (Takkar)తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కార్తీక్ జీ క్రిష్ డైరెక్షన్లో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. జూన్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. అయితే ఈ సినిమాను థియేటర్లో చూడలేని వారి కోసం డిజిటల్ ప్రీమియర్ అప్డేట్ వచ్చేసింది.
టక్కర్ జులై 7న పాపులర్ ఓటీటీ ప్లాట్ఫాంనెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. టక్కర్ నుంచి లాంఛ్ చేసిన కయ్యాలే వీడియో సాంగ్, ఊపిరే లిరికల్ వీడియో సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ మూవీలో పాపులర్ కమెడియన్ యోగిబాబు, అభిమన్యు సింగ్, మునిష్కాంత్, విఘ్నేశ్ కాంత్, రామ్‌దాస్ కీలక పాత్రలు పోషించారు.
టక్కర్ పేద యువకుడు, డబ్బున్న అమ్మాయికి మధ్య సాగే కథతో తెరకెక్కింది. ఈ చిత్రంలో మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్లపై సుధాన్ సుందరం, జీ జయరామ్, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా.. నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.
టక్కర్ ఓటీటీ రిలీజ్..
Siddharth’s #Takkar will be streaming from this July 7 in NETFLIX. pic.twitter.com/uFSc1NASlb
— Christopher Kanagaraj (@Chrissuccess) July 5, 2023
టక్కర్ టీజర్..
Expectation vs Reality..
ఊపిరే లిరికల్ వీడియో సాంగ్..
కయ్యాలే వీడియో సాంగ్..