Param Sundari | బాలీవుడ్ యువ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరం సుందరి’ (Param Sundari). తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఈ చిత్రంలో సిద్ధార్థ్ పంజాబీ అబ్బాయిగా, జాన్వీ కపూర్ కేరళ యువతిగా నటించారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్(Param Sundari Promotions) నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇందులో భాగంగానే సిక్కుల ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ (Gurudwara Bangla Sahib)ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Sidharth Malhotra and Janhvi Kapoor were photographed at a Gurudwara in Mumbai this afternoon.#sidharthmalhotra #janhvikapoor #janhvikapoorfanclub #paramsundari
video: #pallavpaliwal pic.twitter.com/7gRKNtXz0f
— HT City (@htcity) August 23, 2025