సిద్ధార్థ్, దివ్యాంశ కౌషిక్ జంటగా నటించిన సినిమా ‘టక్కర్’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహించారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ జి.క్రిష్ మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో యూనివర్సల్ కంటెంట్ ఉంది.
ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో ఒక ట్రెండీ మూవీ అవుతుంది’ అన్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ…‘నేను డీవీడీలో సినిమాలు చూసేవాడిని. ‘బొమ్మరిల్లు’ సినిమాతో మొదటిసారి థియేటర్లో సినిమా చూడటం మొదలుపెట్టాను. అప్పటినుంచి సిద్ధార్థ్ నటన ఇష్టం’ అన్నారు. హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ…‘ఇదొక యాక్షన్ లవ్‌స్టోరీ. కొత్త తరహా లవర్ బాయ్ పాత్రలో నన్ను చూస్తారు’ అన్నారు.