సిద్ధార్థ్, ఆషిక రంగనాథ్ జంటగా నటించిన చిత్రం ‘మిస్ యు’. ఎన్.రాజశేఖర్ దర్శకుడు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ తెలుగు రాష్ర్టాల్లో పంపిణీ చేస్తున్నది. ఇటీవల ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్థార్థ్ మాట్లాడుతూ ‘దర్శకుడు కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఓ క్యూట్ లవ్‌స్టోరీగా మెప్పిస్తుంది. సంగీతభరిత ప్రేమకథగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా గొప్పగా ఉన్నాయి.
ఈ సినిమా తర్వాత నాకు మరిన్ని లవ్‌స్టోరీస్‌లో అవకాశాలు వస్తాయనుకుంటున్నా’ అన్నారు. బ్రేకప్ తర్వాత కూడా ప్రేమ ఎంత బలంగా మారుతుందో అనే అంశాన్ని ఈ సినిమాలో భావోద్వేగభరితంగా ఆవిష్కరించామని, విజువల్స్‌తో పాటు జిబ్రాన్ సంగీతం హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ప్రేమలో సెకండ్ ఛాన్స్ ఉంటే ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ సినిమాలో గొప్పగా చూపించారని చిత్ర బృందం పేర్కొంది.