‘మహాసముద్రం’ చిత్రంలో సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కలిసి నటించారు. అప్పుడే వీరిద్దరు ప్రేమలో పడ్డారనే వార్తలు వినిపించాయి. తాజాగా ఓ మీడియా సమావేశంలో వీటిపై స్పందిస్తూ అసహనం వ్యక్తం చేసింది అదితి రావు హైదరీ. ఆమె మాట్లాడుతూ ‘తారల వ్యక్తిగత విషయాల గురించి పదేపదే ప్రశ్నించడం మంచిది కాదు. సమయం వచ్చినప్పుడు మీతో అన్ని విషయాల్ని పంచుకుంటాను. ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు అనుకూలంగా మార్చుకొని రాస్తారు.
ప్రేక్షకులకు మా వ్యక్తిగత విషయాల మీద అంతగా ఆసక్తి ఉండదు. మమ్మల్ని మంచి కథల్లో, వైవిధ్యమైన పాత్రల్లో చూడాలని కోరుకుంటారు. వారు కోరుకునే ప్రశ్నలడిగితే బాగుంటుంది’ అని సున్నితంగా హెచ్చరించింది. సిద్ధార్థ్, అదితి రావు హైదరీ కలిసి పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరుకావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, ముంబయిలో సహజీవనం చేస్తున్నారని సోషల్మీడియాలో కథనాలొచ్చాయి.