సిద్ధార్థ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. ఇది సిద్ధార్థ్ 40వ సినిమా కావడం విశేషం. శ్రీగణేశ్ దర్శకుడు. అరుణ్‌విశ్వ నిర్మాత. ఈ సినిమాలో సీనియర్ స్టార్స్ శరత్‌కుమార్, దేవయాని కీలక పాత్రలు పోషించనున్నారు.
ఈ విషయాన్ని ఆదివారం మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. హైబడ్జెట్, టాప్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.