హీరో సిద్ధార్థ్ నటించిన మధ్య తరగతి భావోద్వేగ ప్రయాణం ‘3BHK’. శ్రీగణేష్ దర్శకుడు. అరుణ్ విశ్వ నిర్మాత. జూలై 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ని శనివారం మేకర్స్ విడుదల చేశారు. సొంత ఇంటికల నిజం చేసుకునేందుకు ఓ మధ్య తరగతి కుటుంబం పడే ఆరాటం ఈ ట్రైలర్లో చూడొచ్చు.
అందరికీ కనెక్టయ్యేలా ఈ సినిమా ఉంటుందని, హృదయాలను తాకేలా ఈ సినిమాను దర్శకుడు శ్రీగణేష్ ప్రజెంట్ చేశారని, సిద్ధార్థ్ మధ్య తరగతి కుర్రాడి పాత్రలో ఒదిగిపోయారని మేకర్స్ తెలిపారు. శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో దేవయాని, యోగిబాబు, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: రాకేందు మౌళి, డీవోపీ: దినేష్ కృష్ణన్, బి.జితిన్ స్టానిస్లాన్, సంగీతం: అమృత్ రామ్‌నాథ్.