Hrithik Roshan | బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్, స్టైలిష్ యాక్టర్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ‘హృతిక్ రోషన్'(Hrithik Roshan). కహో నా… ప్యార్ హై(2000) సినిమాతో బాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇదిలావుంటే నేడు ఈ స్టార్ హీరో పుట్టిన రోజు. ఇవాళ ‘హృతిక్ రోషన్’ తన 50వ పుట్టిన రోజు జరుపుకుంటుండటంతో ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆయన అభిమానులు, పలువురు సినీ తారలు, వివిధ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం హృతిక్ ఫైటర్ (Fighter) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్(Siddarth Anand) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే హృతిక్ పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ ఆనంద్ ట్విట్టర్ వేదికగా స్పెషల్ విషెస్ తెలిపాడు.
”నీ బిగ్ డే రోజు నా విషెస్ తో పాటు చిన్న థాంక్యూ. 10 సంవత్సరాల కింద మనం ఈ ప్రయాణం మొదలుపెట్టినం. చాలా తక్కువ మంది మాత్రమే నన్ను నమ్మారు. అందులో మీరు ఒకరు. ఆ తర్వాత జీవితం చాలా మారిపోయింది. నేను నీకు థాంక్యూ చెప్పినట్లు ఎప్పుడు గుర్తులేదు. ప్రతి చిన్న అలాగే పెద్ద విషయాలకు థాంక్యూ. నీకు చాలా మంచి మనసు ఉంది. నీ గురించి తెలిసిన వాళ్లు ఆ అప్యాయత కోరుకుంటారు. ఈరోజు నేను మీకు మంచి ఆరోగ్యం, అపరిమితమైన ఆనందం, అద్భుతమైన విజయం కలగాలని కోరుకుంటున్నాను. నాకు కూడా చిన్న కోరిక మనం ఇలాగే కలిసి ప్రయాణం చేయాలని” అంటూ సిద్ధార్థ్ ఆనంద్ రాసుకోచ్చాడు.
Apart from wishing you, a little thank you note on your big day. 10 years ago we began our journey together. You believed in me at a point when very few people did. Life has never been the same for me. I don’t think I ever thanked you. For the small. And big things. You have a… pic.twitter.com/ySry8EIXEn
— Siddharth Anand (@justSidAnand) January 9, 2024
ఫైటర్ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. దీపికా పదుకొనే, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నాడు. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే గ్రాండ్గా నిర్మిస్తున్నారు.