Saindhav Movie | హిట్ సిరీస్ దర్శకుడు సైలేష్ కొలనుతో వెంకీ మామ తన ప్రతిష్టాత్మక 75వ సినిమా చేస్తున్నాడు. సైందవ్ అంటూ సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే శ్రీలంక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ముందుగా ఈ సినిమా క్రిస్మస్ వీక్‌ను లాక్ చేసుకుంది. కానీ సలర్ రావడంతో మేకర్స్ రిలీజ్ డేట్లో మార్పులు చేశారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సినిమాను సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు ముందు రోజు గుంటూరు కారం రిలీజవుతుంది. త్రివిక్రమ్-మహేష్‌ల కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై జనాల్లో ఓ రేంజ్లో అంచనాలున్నాయి. అదీ కాకుండా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమ కూడా సంక్రాంతికే రానుంది. ఈ రెండు సినిమాల పోటీను తట్టుకుని సైంధవ్ నిలుస్తుందా లేదా చూడాలి. అయితే ఈ సినిమా మాత్రం ఊహించని రేంజ్లో ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే ఈ సినిమాను సంక్రాంతికి మేకర్స్ దింపుతున్నారట.
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయని ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా ఈ సినిమాలో బ్లాక్ మేజిక్ కీలక పాత్ర పోషించనుందట. ఇదే కాన్సెప్ట్‌కు బలమైన డాటర్ సెంటిమెంట్‌ను జోడించి ఆసక్తికర కథగా సైలేష్ ఈ చిత్రాన్ని మలిచాడని తెలుస్తుంది. హిట్ సిరీస్‌తో థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు పొందిన సైలేష్.. ఈ సినిమాతో అసలు సిసలైన థ్రిల్లర్ అంటే ఏంటో చూపించబోతున్నాడట. ముఖ్యంగా జంప్ స్కేర్ సీన్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ రూపొందిస్తుంది.
Sankranthi ki kaluddhaam ❤️#SaindhavOnJAN13th#SAINDHAV@Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555 @maniDop #Venky75 pic.twitter.com/pR95RoMyXQ
— Venkatesh Daggubati (@VenkyMama) October 5, 2023