Samantha – Raj | ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, నటి సమంత మధ్య స్నేహం గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ తరచూ కలిసి కనిపిస్తుండటంతో, వారు రిలేషన్లో ఉన్నారనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా, సమంత ఇటీవల అమెరికా వెకేషన్‌కి వెళ్లిన సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వీటిలో ఆమె ఫ్రెండ్స్‌తో పాటు రాజ్ నిడిమోరు కూడా కనిపించడంతో, అనుమానాలు మరింత బలపడ్డాయి.ఓ ఫోటోలో రాజ్‌తో సమంత క్లోజ్‌గా కనిపించడాన్ని చూసి కొంతమంది ఫ్యాన్స్ కంగ్రాట్స్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’లో సమంత నటించగా, రాజ్-డీకే దర్శకత్వం వహించారు. అదే సమయంలో వీరిద్దరికీ సన్నిహిత పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ‘సిటడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో కూడా సమంత నటించడంతో మళ్లీ కలిసి పని చేశారు. ఇటీవల సమంత నిర్మించిన “శుభం” అనే చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిపై అనేక ప్రచారాలు జరుగుతుండగా, సమంత ఇటీవల తన ఇన్‌స్టాలో ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. ‘ఇతరుల మాటలను పట్టించుకోకుండా ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఏదైనా జరగనీ అన్నట్లు ఉంటే ప్రశాంతత రాదు దాని కోసం నిత్యం సాధన చేయాల్సిన అవసరం ఉంది. ప్రశాంతతను ఆస్వాదించాలి గానీ, దానితో పోరాడొద్దు. జరగాల్సిన దాన్ని జరగనివ్వాలి అంటూ రాసుకొచ్చింది.
అయితే సమంత పోస్ట్ పెట్టిన ప్రతిసారి కూడా రాజ్ భార్య శ్యామాలి కూడా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. తాజాగా రాజ్‌తో సన్నిహితంగా దిగిన ఫొటోలని సమంత పోస్ట్ చేయడంతో, శ్యామాలి ఆసక్తికర సందేశాన్ని పంచుకుంది. ఇందులో వివిధ మతాల సారాంశం ఉంది. మతం ఏదైన కూడా మనం చేసే పనులతో ఇతరులని బాధించకూడదు అనే చెబుతుంది. అదే మనం జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం అని అందులోని సారాంశం. అయితే రాజ్-సామ్ ఫొటోలు వైరల్ అవుతున్న సమయంలో శ్యామాలి ఇలా పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. సమంత-రాజ్ వలన శ్యామాలి చాలా బాధపడుతున్నట్టుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.