Prabhas | ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో ఏళ్ళుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ప్రతి ఏడాది తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారాలు నడుస్తున్నాయి. అయితే దీనిని వారిద్దరు ఖండిస్తూనే వస్తున్నారు. తాము మంచి స్నేహితులమని అంతకు మించి ఏమీ లేదని చెప్పిన కూడా ఏదో ఒక వార్త పుట్టిస్తూనే ఉన్నారు. మరోవైపు ‘ఆదిపురుష్’ సినిమా హీరోయిన్ కృతి సనన్‌తో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని పుకార్లు వినిపించాయి.
షూటింగ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని గుసగుసలు వినిపించాయి. కృతి సనన్‌తో ప్రేమ వ్యవహారం గురించి అన్‌స్టాప్‌బుల్ షోకు ప్రభాస్ గెస్ట్‌గా వచ్చిన సమయంలో బాలయ్య ప్రభాస్‌ను నేరుగానే ప్రశ్నించాడు. బాలకృష్ణ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేసిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. ప్రభాస్ పెళ్లి గురించి చాలా ఏళ్ల నుంచి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి గత పదేళ్లుగా సినీ అభిమానుల్లో, మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.
తాజాగా పెద్దమ్మ శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. బయట అమ్మాయో, సినిమా అమ్మాయా అనేది తెలియదు కానీ, ప్రభాస్ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని స్పష్టం చేసింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కాగా, శ్రావణమాసం కావడంతో శ్యామలా దేవి తన కుటుంబ సభ్యులతో కలిసి ద్రాక్షారామంలోని భీమ లింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేసింది. పూజా కార్యక్రమాల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదైన కావొచ్చు లేదంటే వచ్చే ఏడాది అయిన ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ప్రభాస్ పెద్దమ్మ అన్నారు.