కరోనా పరిస్థితులు సినిమా పరిశ్రమకు లేనిపోని తంటాలు తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు థియేటర్స్లో సందడి చేస్తూ అలరించే సినిమాలు ప్రస్తుతం ఓటీటీ బాట పడుతున్నాయి. నేచురల్ స్టార్ నాని తన సినిమాలను థియేటర్లోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టుకు కూర్చుంటున్న అది కుదరడం లేదు. ఇప్పటికే నాని నటించిన వి చిత్రం ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే.
తాజాగా నాని నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని తప్పక థియేటర్లో విడుదల చేస్తానని చెప్పిన నాని రీసెంట్గా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టుగా హింట్ ఇచ్చాడు. నిర్మాతల నిర్ణయమే నా నిర్ణయం అన్నాడు. టక్ జగదీష్ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు 37 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుండగా, స్టార్ మా వారు ఏడున్నర కోట్లకు శాటిలైట్ రైట్స్ దక్కించుకున్నారు . మొత్తంగా ఈ చిత్రం 51.5 కోట్ల బిజినెస్ జరుపుకోగా, మంచి లాభాల బాట పట్టినట్టు అర్ధమవుతుంది.
ఇక నాని కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన శ్యామ్ సింగ రాయ్ చిత్రానికి కూడా భారీ ఓటీటీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. కోల్కతా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి హాట్ స్టార్ 40 కోట్ల రూపాయలు ఆఫర్ చేయగా, నిర్మాతలు కూడా అంత రేటు చూసి ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేద్దామని అనుకున్నారట. కాని నాని మాత్రం ఇందుకు ససేమీరా అని చెప్పాడట. ఈ చిత్రం నాని కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది.
‘ట్యాక్సీవాలా’తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని బెంగాలీ లుక్లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.