టాలీవుడ్ (Tollywood) హీరో నాని (Nani) ప్రస్తుతం శ్యామ్‌సింగరాయ్ (Shyam Singha Roy)ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ 1970 కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా దీపావళి సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. శ్యామ్ సింగరాయ్ ముగ్గురు భామల ఫస్ట్ లుక్ పోస్టర్లను షేర్ చేసింది రాహుల్ సంకీర్త్యన్ టీం.
చేతిలో హారతి పల్లెం పట్టుకుని సంప్రదాయ లుక్‌లో సాయిపల్లవి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. మరోవైపు కృతిశెట్టి మోడ్రన్ డ్రెస్ లో చేతిలో పుస్తకం పట్టుకుని ఉంది. మడోన్నా సెబాస్టియన్ సింపుల్ లుక్‌లో ఆలోచిస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపిస్తుంది. నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
The TRIDENT 🔱 of #ShyamSinghaRoy that surpasses
— BA Raju's Team (@baraju_SuperHit) November 4, 2021
TRUTH @MadonnaSebast14
MEMORY @IamKrithiShetty and
TIME @Sai_Pallavi92 ✨
wishing you all a Very #HappyDiwali#SSRonDEC24th 💥
Natural 🌟@NameisNani @Rahul_Sankrityn @MickeyJMeyer @vboyanapalli @NiharikaEnt @SSRTheFilm pic.twitter.com/K75XXlual8
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. శ్యామ్‌సింగరాయ్ డిసెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.