ఇటీవలి కాలంలో నేచురల్ స్టార్ నాని సక్సెస్ రేటు తగ్గింది. కరోనా వలన నాని నటించిన వి చిత్రం ఓటీటీలో విడుదలై నెగెటివ్ టాక్ సంపాదించుకుంది. నాని నటించిన టక్ జగదీష్ చిత్రం కూడా ఓటీటీలో విడుదలై ఫ్లాప్ అయింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు పలు వివాదాలు నడవగా, సినిమాకి మంచి ప్రమోషన్ లభించింది. కాని చిత్ర కథ ప్రేక్షకులని అలరించలేకపోయింది. అయితే నాని నటించిన వరుస సినిమాలు ఓటీటీలో విడుద అవుతున్న నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ చిత్ర విడుదలపై సందేహాలు నెలకొని ఉన్నాయి.
నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘శ్యామ్ సింఘ రాయ్’ చిత్రం పీరియాడిక్ డ్రామాగా రూపొందుతుండగా, ఈ చిత్రం డిసెంబర్ 24 న విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేటర్స్‌లోనే ఈ సినిమా విడుదల కానుందని తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాపై జనాలలో భారీ అంచనాలు ఉన్నాయి.