చిత్రకారుడు శంతనుహజారికాతో అగ్ర నాయిక శృతిహాసన్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట ముంబయిలో సహజీవనం సాగిస్తున్నారని తెలిసింది. సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే శృతిహాసన్ తమ అనుబంధం విషయంలో ఎలాంటి దాపరికాల్ని ప్రదర్శించదు. ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా బాయ్‌ఫ్రెండ్ శంతన్ హజారికాకు సంబంధించిన విషయాల్ని పంచుకుంటుంది. తాజాగా అతనితో కలిసి తీయించుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. దీనికి ఓ భావోద్వేగభరితమైన వ్యాఖ్యానాన్ని జోడించింది. ‘నువ్వే నా సర్వస్వం. ఈ ప్రపంచంలో నీకన్నా గొప్పగా నన్నెవరూ చూసుకోరు’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల తెలుగులో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ చిత్రాలతో శృతిహాసన్ మంచి విజయాల్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.