Shruti Haasan | పట్టిందల్లా బంగారమే.. స్వాతంత్య్ర సమరయోధురాలి పాత్రలో శృతిహాసన్
అగ్ర కథానాయిక శృతిహాసన్ పట్టిందల్లా బంగారమవుతున్నది. ఈ భామ నటించిన సినిమాలన్నీ విజయం సాధిస్తుండటంతో అదృష్ట నాయిక అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. గత ఏడాది తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్, హాయ్ నాన్న సినిమాలు ఈ అమ్మడికి మంచి విజయాలను అందించాయి.
Shruti Haasan |అగ్ర కథానాయిక శృతిహాసన్ పట్టిందల్లా బంగారమవుతున్నది. ఈ భామ నటించిన సినిమాలన్నీ విజయం సాధిస్తుండటంతో అదృష్ట నాయిక అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. గత ఏడాది తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్, హాయ్ నాన్న సినిమాలు ఈ అమ్మడికి మంచి విజయాలను అందించాయి. ఈ నేపథ్యంలో కథల ఎంపికలో మరింత వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుందట శృతిహాసన్. తాజా సమాచారం ప్రకారం తమిళంలో ‘వేలు నాచ్చియార్’ అనే వీర వనిత పాత్రలో నటించబోతున్నదట.
స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ధీర వనితగా తమిళనాట వేలు నాచ్చియార్ ప్రసిద్ధికెక్కింది. కథలోని దేశభక్తి అంశాలు, తన పాత్రలోని ధీరత్వం నచ్చడంతో ఈ సినిమాకు శృతిహాసన్ ఓకే చెప్పిందని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్‌లోనే కనిపించిన ఈ అమ్మడు తొలిసారి స్వాతంత్య్ర పోరాట నేపథ్య కథలో నటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మాతృభాష తమిళంలో శృతిహాసన్ నటించబోతున్న చిత్రమిదే కావడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

