Shruti Haasan | దేవుడిచ్చిన బహుమతి
అగ్ర కథానాయిక శృతిహాసన్ కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా గాయనిగా కూడా రాణిస్తున్నది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌లో ఈ భామ పాటలు పాడిన విషయం తెలిసిందే.
అగ్ర కథానాయిక శృతిహాసన్ కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా గాయనిగా కూడా రాణిస్తున్నది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌లో ఈ భామ పాటలు పాడిన విషయం తెలిసిందే. నటనతో పాటు గానం, గీత రచన తనకు ఇష్టమైన వ్యాపకాలని చెప్పింది శృతిహాసన్. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు పాటల గురించి అస్సలు మాట్లాడేదాన్ని కాదు. అలా చేస్తే సినిమాలకు దూరం అవుతానేమో అనిపించేది. అయితే కొన్నేళ్లు గడచిన తర్వాత నటనతో పాటు పాటలకు కూడా సమ ప్రాధాన్యతనిచ్చాను.
కోవిడ్ లాక్డౌన్ సమయంలో గాయనిగా నా ప్రతిభకు మరింతగా మెరుగులు దిద్దుకున్నా. గీతాన్ని ఆలపించడంతో పాటు రచన చేయడం నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి అనుకుంటున్నా. నాలోని భావాల్ని ప్రపంచానికి తెలియపరచడానికి పాట ఓ చక్కటి సాధనంగా ఉపయోగపడుతుంది’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

