అగ్ర కథానాయిక శృతిహాసన్‌కు ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. అవన్నీ భారీ ప్రాజెక్ట్‌లే కావడం విశేషం. శృతిహాసన్ కీలక పాత్రను పోషిస్తున్న ‘కూలీ’ చిత్రం ఆగస్ట్ 14న విడుదలకానుంది. రజనీకాంత్ కథానాయకుడిగా నాగార్జున, అమీర్‌ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి లొకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శృతిహాసన్ తాజా ఇంటర్వ్యూలో ‘కూలీ’ విశేషాలను పంచుకుంది.
రజనీకాంత్ వంటి లెజెండ్‌తో వర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేసింది. ‘ఓ మ్యూజిక్ ఆల్బమ్ కోసం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ని కలిసినప్పుడు ఆయన ఈ కథ చెప్పారు. నా క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది’ అని చెప్పింది. డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవని, సంగీతం ఇష్టం కాబట్టి ఏదైనా సినిమాలో మ్యూజిషియన్ రోల్ ప్లే చేయాలనుందని శృతిహాసన్ పేర్కొంది. పదిహేనేళ్లుగా కెరీర్లో కొనసాగడం అదృష్టంగా భావిస్తున్నానని, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకుండా పనిని ఆస్వాదించడమే తాను నమ్మే సిద్ధాంతమని శృతిహాసన్ చెప్పింది.