కమల్ గారాల పట్టి శృతి హాసన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతుంది. ఒక వైపు సినిమాలు మరోవైపు బాయ్ ఫ్రెండ్‌తో చక్కర్లు ఈ అమ్మడి పేరు హెడ్ లైన్స్‌లో నిలిచేలా చేస్తున్నాయి. కాటమరాయుడు తరువాత తెలుగులో కనిపించకుండా పోయిన శృతి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన క్రాక్ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వగా, ఈ సినిమా మంచి విజయం సాధించింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి వకీల్ సాబ్ లో మెరిసిన శృతి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తూ నిర్మించిన లాభంలో నటించింది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ అనే సినిమా చేస్తుంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం సలార్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. దీంతో శృతి కొద్ది రోజులుగా అక్కడే ఉంటుంది.
షూటింగ్ గ్యాప్‌లో శృతి హాసన్.. తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికాతో కలిసి చక్కర్లు కొడుతుంది. తాజాగా శాంతనుతో డిన్నర్ డేట్ వెళ్లిన ఈ జంట ముందు మీడియా కంటికి చిక్కింది. టాప్ టూ బాటమ్ మాస్క్ తో సహా ఆల్ బ్లాక్ లో శృతిహాసన్ కనిపించింది. బ్రౌన్ కలర్ టీషర్ట్.. బ్లాక్ కలర్ నైక్ లూజర్ లో శంతను కనిపించాడు. డిన్నర్ డేట్ కి ముందు ఈ ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.