Shruti Haasan | కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా ఎంతో మంది మనసులు గెలుచుకుంది శృతి. పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత టాలీవుడ్ లో చాలా సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ హీరోయిన్గా ఎదిగింది. శృతి హాసన్ సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల శృతి ఎక్కువగా తన బ్రేకప్‌తో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. గతంలో మైకెల్ అనే విదేశీ వ్యక్తితో తో బ్రేకప్ అయ్యాక.. బాగా డిస్టర్బ్ అయిన శృతి ఆ తర్వాత శాంతనుతో డేటింగ్ చేస్తుంది. వీళ్ళ లవ్ గురించి బహిరంగంగానే ఎప్పుడో చెప్పేసింది.
కాని ఎందుకో ఏమైందో కాని శృతి అతనికి కూడా బ్రేకప్ చెప్పింది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన రిలేషన్ షిప్స్ పై ఓపెన్ అయ్యింది. ఇలాంటి పని ఎందుకు చేశానా అని తాను బాధపడిన సందర్భాలు లేవని, ఇష్టమైన వారిని మాత్రం కొన్ని సార్లు బాధ పెట్టానని శృతి హాసన్ చెప్పుకొచ్చింది. లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుంది. మాజీ భాగస్వామి వల్ల మనం ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటాం. నాక్కూడా అలాంటి బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయి.
తాను ఎలాంటి బాధ లేకుండా రిలేషన్ షిప్స్‌ను ముగించేస్తానని , తన వరకు నిజాయితీగా ఉంటానని.. అందుకే చాలా మంది తనను ఎన్నో నెంబర్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నావంటూ ట్రోల్ చేస్తూ ఉంటారని శృతి హాసన్ పేర్కొంది. తన విషయంలో అన్ని సార్లు ప్రేమలో ఫెయిల్ అవుతున్నాను అంటే నిజమైన ప్రేమను పొందడంలో ఫెయిల్ అవుతున్నానని అర్థం అంటూ వాపోయింది. జీవితంలో ఇలాంటి పని ఎందుకు చేశానా.. అని బాధపడిన సందర్భాలు ఎక్కువగా లేవని స్పష్టం చేసింది. కానీ కొన్నిసార్లు తనకు ఇష్టమైన వారిని బాధపెట్టానని.. అనుకోకుండా జరిగినప్పటికీ అలా చేయకుండా ఉండాల్సింది అనే భావన ఎప్పటికీ ఉంటందని పేర్కొంది. వారికి జీవితాంతం క్షమాపణలు చెబుతూనే ఉంటానని శృతి పేర్కొంది.