Sruthi Haasan | లోకనాయకుడు కమల్ హాసన్ కుతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అందంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. అంతేకాకుండా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న కథానాయికల లిస్ట్‌లో కూడా శృతిహాసన్ ఉంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. 50కి పైబడిన యాక్టర్లందరూ శృతిహాసన్కే ఓటు వేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ నటించిన వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్యలు రిలీజై పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సుందరి ప్రస్తుతం ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు రెండు రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.
తాజాగా శృతిహాసన్ కొన్ని మాససిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి.. అయితే వాటిని శృతిహాసన్ ఖండించింది. తనకు ఎలాంటి వ్యాధి లేదని, బాగానే ఉన్నానని తెలిపింది. అంతేకాకుండా కేవలం తనకు వైరల్ ఫీవర్ మాత్రమే వచ్చిందని, దానిపై ఇలా రూమర్స్ సృష్టించారని పేర్కొంది. అలాంటి వాటిని నమ్మొద్దని క్లారిటీ ఇచ్చేసింది.
ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ‘సలార్’ కూడా ఒకటి. ఈ సినిమాలో శృతి ఆధ్య పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన ఆమె లుక్కు మంచి స్పందన వచ్చింది. దీనితో పాటు ఓ ఇంగ్లీష్ మూవీలోను నటిస్తుంది. ‘ది ఐ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ జానరల్లో తెరకెక్కుతుంది. వీటితో పాటుగా ఓ తమిళ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఏడాది కూడా ఈ అమ్మడు బిజీ బిజీగానే షూటింగ్ సెట్లలో గడపనుంది.