‘ఇష్టం’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ శ్రియ ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చిరంజీవి నుండి రజనీకాంత్ వరకు స్టార్ హీరోలందరితో కలిసి సందడి చేసింది. 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్ని పెళ్ళాడి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. సోషల్ మీడియాలో మాత్రం తన భర్తతో కలిసి నానా రచ్చ చేస్తుంది. పలుమార్లు విమర్శల పాలు కూడా అయింది. అయిన శ్రియ తన పంథా మార్చుకోలేదు.
రీసెంట్గా శ్రియ 2020లో రాధ అనే చిన్నారికి జన్మనిచ్చినట్టు పేర్కొంది. 2020లో అందరూ కరోనా కారణంగా ఇబ్బందులు ఎదురుకోగా.. తనకు మాత్రం దేవుడు మరిచిపోలేని ఓ బహుమతిని ఇచ్చాడు అని ఆమె తెలిపింది.ఈ విషయం తెలిసి అందరు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం శ్రియ మాతృత్వాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. కొద్ది రోజుల క్రితం ఈ అమ్మడు తన ఫ్యామిలీతో ముంబైకి రాగా, అక్కడ వీధుల్లో కూతురితో కలిసి ఫ్రూట్స్ కొంటుండగా, ఈ సన్నివేశాలని శ్రియ భర్త చిత్రీకరించాడు. కూతురిని భుజాలపై కూర్చోపెట్టుకొని చక్కగా తిప్పుతుంది శ్రియ. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్గా మారాయి.