వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ సినిమా సైంధవ్. వెంకట్ బోయనపల్లి నిర్మాత. శైలేష్ కొలను దర్శకుడు. ఈ చిత్రంలో నాయికగా నటిస్తున్నది శ్రద్ధా శ్రీనాథ్. శనివారం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా కనిపించనుందని చిత్రబృందం వెల్లడించింది.
నటనకు ఆస్కారమున్న ఈ పాత్రలో శ్రద్ధా ఆకట్టుకుంటుందని, గతంలో ఆమెకు ‘జెర్సీ’ చిత్రంలో నటనకు వచ్చినంత మంచి పేరు ఈ సినిమాతో తిరిగి సంపాదించుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవలే తొలి షెడ్యూల్ హైదరాబాద్లో ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండో షెడ్యూల్ విశాఖలో జరుపుకుంటున్నది. ఇందులో కీలక పాత్రధారులంతా పాల్గొంటున్నారు.