Saindhav Movie | ఫలితం ఎలా ఉన్నా వెంకీ మామా మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే రానానాయుడు వెబ్ సిరీస్‌తో ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి విమర్శల పాలయ్యాడు. ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల్లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్న వెంకీ ఒక్క సారిగా అలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ చేయడంతో ఎక్కడలేని నెగెటీవిటి వచ్చేసింది. ప్రస్తుతం వెంకీ మామా దాన్ని సరిచేసుకునే పనిలో పడ్డాడు. ఇక వెంకీ ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ మీదుంచాడు. అందులో సైంధవ్ ఒకటి. హిట్ ఫేమ్ సైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, అనౌన్స్మెంట్ వీడియో ఎక్కడలేని బజ్‌ను క్రియేట్ చేసింది.
త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్న ఈ సినిమాలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు తెలుస్తుంది. అందులో ఒక హీరోయిన్గా రుహాని శర్మ నటించనున్నట్లు తెలుస్తుంది. అయితే అందులో రుహాని పాత్ర సెకండ్ హీరోయిన్ అట. కాగా మేయిన్ హీరోయిన్గా జెర్సీ ఫేం శ్రద్ధ శ్రీనాథ్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే ఈమెతో చిత్రబృందం సంప్రదింపులు కూడా జరిపారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కృష్ణ అండ్ ఈజ్ లీల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ జోడీ, జెర్సీ వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.