Walt Disney Studios | విభిన్నమైన పాత్రలతో బాలీవుడ్‌తో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఇప్పుడు మరో కొత్త పాత్రలోకి అడుగుపెడుతుంది. అయితే ఆమె ఈసారి వెండితెరపై కాకుండా.. తెర వెనుక తన హంగామాను సృష్టించబోతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ స్టూడియోస్‌లో (Walt Disney Studios) రూపుదిద్దుకున్న సూపర్ హిట్ యానిమేషన్ చిత్రం ‘జూటోపియా’ (Zootopia). పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జూటోపియా 2’ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డిస్నీ సంస్థ నుంచి రాబోతున్న 64వ యానిమేషన్ చిత్రమిది. ఈ చిత్రంలో కీలకమైన జూడీ హోప్స్ (Judy Hopps) అనే ఉత్సాహవంతులైన కుందేలు పోలీసు అధికారి పాత్రకు హిందీలో శ్రద్ధా కపూర్ తన వాయిస్ ఓవర్‌ని అందించబోతున్నారు.
ఈ విషయాన్ని ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ ఇండియా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అద్భుతమైన నటి శ్రద్ధా కపూర్ జూటోపియా 2 ఫ్యామిలీలో చేరడం చాలా ఉత్సాహంగా ఉంది అని ఆ పోస్ట్‌లో పేర్కొంది. శ్రద్ధా కపూర్ కూడా ఈ అవకాశంపై స్పందిస్తూ.. అద్భుతమైన జూడీ హోప్స్ పాత్రకు హిందీలో గాత్రం అందించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆమె ధైర్యవంతురాలు, సాహసి.. చిన్నప్పటి నుంచి చాలా క్యూట్‌గా ఉంటుంది అని తెలిపారు. జారెడ్ బుష్, బైరన్ హోవార్డ్ దర్శకత్వం వహించిన ఈ యానిమేషన్ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది.
😍🐰 Bohot jyada excited to join the #Zootopia2 family, as the voice of THE AMAZING Judy Hopps in Hindi – She is feisty, courageous, enthu cutlet aur cute toh hai hi bachpan se😊 Kal aa raha hai aapke liye ek anokha surpise. Stay Tuned!! 🥕🐰#Zootopia 2 – In cinemas November 28 pic.twitter.com/5JQPoDhh8A
— Walt Disney Studios (@DisneyStudiosIN) November 7, 2025