Shraddha Kapoor | దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న కథానాయికల్లో శ్రద్ధా కపూర్ ఒకరు. ఆషికీ-2, ఓకే జాను, చిచోరే, సాహో వంటి చిత్రాలతో ఆమె యువతరానికి బాగా చేరువైంది. ఆమె గత చిత్రం ‘తూ జూతీ మై మక్కర్’ కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆమె ‘స్త్రీ-2’ చిత్రంలో నటిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ భామ సరికొత్త ప్రేమాయణం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది.
‘తూ జూతీ మై మక్కర్’ చిత్ర రచయితల్లో ఒకరైన రాహుల్ మోదీతో ఈ అమ్మడు ప్రేమలో పడిందని ప్రచారం జరుగుతున్నది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాహుల్ మోదీతో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో రాహుల్ చేతిని పట్టుకొని నవ్వుతూ కనిపిస్తున్నది శ్రద్ధాకపూర్. ఈ ఫోటోకు స్మైలీ, లవ్ ఎమోజీలను జోడించింది. ఈ ఫొటో ద్వారా తన లవ్ఎఫైర్ను శ్రద్ధాకపూర్ అధికారికంగా ప్రకటించిందని అభిమానులు భావిస్తున్నారు. ‘తూ జూతి మై మక్కర్’ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని, అప్పటి నుంచి డేటింగ్లో ఉన్నారని వారి సన్నిహితులు అంటున్నారు.