Shraddha Kapoor | ఖాన్‌లతో జత కట్టకుండా.. సోలోగా తొమ్మిదొందల కోట్ల హిట్‌ను కొట్టిన క్రెడిట్ శ్రద్ధా కపూర్ది. ‘స్త్రీ2’ తర్వాత బాలీవుడ్లో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆమెతో సినిమా చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్న పరిస్థితి. ఇంతటి క్రేజ్‌ని ఎంజాయ్ చేస్తూ.. ఓ ఐటమ్ సాంగ్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట శ్రద్ధా కపూర్. ప్రస్తుతం బీటౌన్‌లో ఈ వార్త చర్చనీయాంశమైంది. హృతిక్, తారక్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘వార్ 2’లోని కీలక సన్నివేశంలో వచ్చే ఐటమ్నంబర్ కోసం శ్రద్ధను సంప్రదించారట దర్శకుడు అయాన్ ముఖర్జీ.
సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ పాటలో నర్తించేందుకు శ్రద్ధ ఓకే చెప్పిందట. హీరోయిన్గా చేస్తే ఇచ్చేంత పారితోషికం ఒక్క పాటకే ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదరటం వల్లే శ్రద్ధా కపూర్ ఓకే చెప్పిందని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి రెండేళ్ల క్రితం ఐటమ్ సాంగ్ కోసమే ‘పుష్ప2’ టీమ్ శ్రద్ధా కపూర్‌ని సంప్రదించింది. కానీ ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆ ఛాన్స్ శ్రీలీలను వరించింది. ఇప్పుడు ‘వార్ 2’ సాంగ్‌కి మాత్రం శ్రద్ధ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. అంటే.. బన్నీకి నో చెప్పి.. తారక్‌కు ఎస్ చెప్పిందన్నమాట. ప్రస్తుతం ఈ విషయంపై బాలీవుడ్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.