Stree | ‘స్త్రీ’ బాగా ఆడింది. నిర్మాతలకు డబ్బులు, పనిచేసిన వారికి పేరు తెచ్చిపెట్టింది. మొదట్లో ఈ సినిమాకు సీక్వెల్ చేయాలన్న ఆలోచన లేదు. ఆ ఊహ కూడా ఎవరికీ రాలేదు. ఓరోజు దర్శకుడు అమర్ కౌశిక్ ‘స్త్రీ 2’ కథ చెప్పాడు. కాసేపు షాక్‌లో ఉండిపోయా. తను ఇంత కొత్తగా ఎలా ఆలోచించాడా?! అనిపించింది. అయితే.. ఇంతటి సక్సెస్ మాత్రం ఊహించలేదు. అసలు ఓ హారర్ కామెడీ సినిమాకు 900కోట్లు రావడమేంటి? బాలీవుడ్లో ఎవరికీ మింగుడు పడని విజయం ఇది.’
అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్. ఇంకా ఆమె మట్లాడుతూ ‘ ‘స్త్రీ 2’ విజ యం మా టీమ్ అందరికీ సొంతం. స్క్రిప్ట్ బావుంటే కాస్టింగ్‌ను కూడా ప్రేక్షకులకు పట్టించుకోరని ‘స్త్రీ 2’ రుజువు చేసింది. మూడో పార్ట్‌లో ఎంటైర్టెన్మెంట్ ఇంతకు మించి ఉంటుంది. పనులు కూడా మొదలయ్యాయి. చాలా డెవలప్మెంట్లు జరిగాయి కూడా.’ అంటూ ‘స్త్రీ 3’కు సంబంధించిన అప్డేట్ని ఆడియన్స్‌కి అందించింది శ్రద్ధాకపూర్.