Shraddha Kapoor | తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ భామల్లో ఒకరు శ్రద్దాకపూర్ (Shraddha Kapoor). సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన ఈ భామ నెట్టింట ఏదో ఒక అప్డేట్తో క్యూరియాసిటీ పెంచేస్తుంది. తాజాగా శ్రద్దాకపూర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శ్రద్దాకపూర్ రైటర్ రాహుల్ మోడీ ( Rahul Mody) తో రిలేషన్షిప్లో ఉందా..? అంటే తాజా పోస్ట్ ఒకటి అవుననే అంటోంది.
ఈ ఇద్దరు పలు పార్టీలో కలిసి కనిపించడం, శ్రద్దాకపూర్ R అక్షరంతో ఉన్న లాకెట్‌ను ధరించడంతో ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా రాహుల్ మోడీతో క్లోజప్ యాంగిల్లో దిగిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన శ్రద్దాకపూర్.. నా మనస్సును హత్తుకో.. కానీ నన్ను నిద్రపోనివ్వు.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. శ్రద్దాకపూర్ తాను రాహుల్ మోడీతో రిలేషన్షిప్లో ఉన్నానని దాదాపు క్లారిటీ ఇచ్చేసిందంటూ తెగ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
శ్రద్దాకపూర్ నటించిన Tu Jhoothi Main Makkaarకు రైటర్‌గా పనిచేశాడు రాహుల్ మోడీ. ఈ మూవీ టైంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని బీటౌన్ సర్కిల్ టాక్. రాహుల్ మోడీ మరో రెండు సినిమాలకు కూడా రైటర్‌గా పనిచేశాడు. శ్రద్దాకపూర్ నటించిన స్త్రీ 2 ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కానుంది.