Trikaala Movie | మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్‌తో రూపొందుతున్న తాజా చిత్రం త్రికాల. ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. రిత్విక్ వేట్షా సమర్పణలో, రాధిక మరియు శ్రీనివాస్ నిర్మాతలుగా, శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు.
శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. తనికెళ్ల భరణి, సాయి దీనా కూడా కీలక పాత్రల్లో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్, నటుడు అజయ్ విశ్వరూపం, పవర్ఫుల్ డైలాగ్స్, శ్రద్ధా దాస్ మేకోవర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌తో క్రియేట్ అయిన హైప్ కారణంగా, ‘త్రికాల’ చిత్రానికి నార్త్ ఇండియాలోనూ బిజినెస్ జరగడం విశేషం. ప్రస్తుతం అన్ని చోట్లా ఈ సినిమాపై మంచి డిమాండ్ ఏర్పడింది.
ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించడం మరో ప్రధాన ఆకర్షణ. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఆయన, ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’, పూరి-విజయ్ సేతుపతి సినిమాలకు పనిచేస్తున్నారు. అయినా కూడా ‘త్రికాల’ కథ నచ్చి, ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇందులో ఆయన సౌండింగ్ ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్ర బృందం తెలిపింది.
‘త్రికాల’కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం పూర్తి అయ్యాయి. చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ కార్యక్రమాల్ని పెంచే పనిలో పడింది. ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత బజ్‌ను క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ నెలలో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
సాంకేతిక నిపుణులు:
నిర్మాత: రాధిక, శ్రీనివాస్
సహ నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి
దర్శకుడు, ఎడిటర్: మణి తెల్లగూటి
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
బీజీఎం: షాజిత్ హుమాయున్
కెమెరా: పవన్ చెన్నా
సౌండ్ డిజైన్: ప్రదీప్
లిరిక్స్: రాకేందు మౌళి, కడలి