NTR | అగ్ర హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఆయన ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే వారం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. వికారాబాద్ అడవుల్లో తొలి షెడ్యూల్ మొదలవుతుందని, అక్కడ కొన్ని కీలక ఘట్టాలను తెరకెక్కించబోతున్నారని సమాచారం.
కొద్దిరోజుల తర్వాత ఎన్టీఆర్ షూట్లో జాయిన్ అవుతారని చెబుతున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఖరారు చేశారని ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్‌ను అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.