‘పెద్ది’ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నది. ఇటీవలే ఢిల్లీ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఈ నెల చివర్లో చిత్రబృందం యూరప్ వెళ్లనుంది. అక్కడ జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. యూరప్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తోపాటు రామ్‌చరణ్, జాన్వీలపై ఓ పాటను కూడా చిత్రీకరిస్తారట. మార్చి 27న సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే.. ఈ సినిమా ైక్లెమాక్స్ విషయంలో ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. కథ రీత్యా ఓ ప్రమాదంలో హీరో రెండు కాళ్లూ ఇందులో దెబ్బతింటాయట. అయినప్పటికీ రన్నింగ్‌లో హీరో ఛాంపియన్‌గా నిలుస్తాడట. ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తున్నది. ఇప్పటివరకూ రామ్‌చరణ్ హీరోగా వచ్చిన సినిమాలన్నింటిలో భిన్నంగా ‘పెద్ది’ ఉంటుందనేది ఇన్సైడ్ టాక్. శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, దివ్యేందుశర్మ ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్, నిర్మాతలు: వెంకటసతీశ్ కిలారు, ఇషాన్ సక్సేనా, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ సినిమాస్, నిర్మాణం: వృద్ది సినిమాస్.