బిగ్ బాస్ హౌజ్‌లో సండే వచ్చిందంటే తెగ సందడి నెలకొనడం ఖాయం. ఈ ఆదివారం నాగార్జున ఇంటి సభ్యులతో పలు గేమ్స్ ఆడించాడు. ప్రశ్నకు వేళాయే అంటూ.. కంటెస్టెంట్లు వేసిన ప్రశ్నలని.. కంటెస్టెంట్లకే వేసి వాటి సమాధానాలు బయటకు వచ్చేలా చేశాడు. ఇందులో భాగంగా మొదట శ్రీరామచంద్రకు ప్రశ్నలు వేశాడు నాగార్జున. మాస్కులతో ఉన్నావా? బాగా నటిస్తున్నావా? అని ప్రశ్నలు వేశాడు. తానేమీ మాస్కుతో లేనని, నటించడం లేదని శ్రీరామచంద్ర ఆన్సర్ ఇచ్చాడు.
దీనికి ఇంటి సభ్యులలో కాజల్, మానస్ తప్ప అందరు ఏకీభవించారు. ఇక సిరికి ప్రశ్నలు సంధించాడు. షన్ను వల్ల ఆటలో వెనకబడిపోతోన్నావా? అని నాగ్ అడిగాడు. అలా ఏం లేదని సిరి చెప్పింది. బయట మా ఇద్దరికీ పడదు.. ఇక్కడకు వచ్చాకే షన్నుతో ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని సిరి చెప్పుకొచ్చింది. ఇక సన్నీ మరీ అంత వైల్డా?, సేఫ్ ప్లేయర్.. ఆట నుంచి ఎందుకు డీవియేట్ అవుతున్నావ్ అంటూ షన్నుకు ప్రశ్నలు సంధించాడు.
సన్నీ కాస్త వైల్డ్‌గా ఆడుతుంటాడు.. నేను మాత్రం సేఫ్ ప్లేయర్ కాదు.. ఏమనిపిస్తే అదే అనేస్తాను.. ఎమోషన్స్ వల్ల కాస్త డీవియేట్ అయినా కూడా మళ్లీ ఆటలోకి వస్తాను అని షన్ను అన్నాడు. నాతో మాట్లాడేందుకు భయపడుతున్నావా? అంటూ షన్ను మానస్‌కు ప్రశ్నను సంధించాడు.