పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాత శిల్పా శెట్టి కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. తను చేస్తున్న టీవీ షోస్‌కు కూడా కొన్నిరోజులు దూరంగా ఉంది. సోషల్ మీడియాలోను ఎలాంటి స్పందన లేదు. ఈ వ్యవహారంలో తన తప్పేమి లేదన్నట్టు కొద్ది రోజుల క్రితం చెప్పుకొచ్చిన శిల్పా శెట్టి తాజాగా ..చేసిన తప్పులకు జీవితాంతం మూల్యం చెల్లించాల్సిందే అని సోఫియా లారెన్ చెప్పిన కొటేషన్‌తో పాటు ఓ పుసక్తంలో మిస్టేక్స్ అని రానున్నఅధ్యాయానికి సంబంధించిన పేజ్ షేర్ చేసింది.
తప్పులు చేయకుండా మన జీవితాన్ని మలచుకోలేం. మనం చేసే తప్పులు ఇతరులను బాధించేలా ఉండకూడదు. తప్పులు మనకు సవాల్ విసిరేలా, ఉత్తేజపరిచే అనుభవాలుగా, ఆసక్తికరంగా లేదంటే మరచిపోయేదిగా ఉండాలి. చేసిన తప్పుల నుండి ఏదైన ఒకటి నేర్చుకోవాలి. నేను తప్పులు చేయబోతున్నా… తప్పుల నుండి నన్ను నేను క్షమించుకొని, వాటి నుండి ఎంతో కొంత నేర్చుకుంటాను అని రాసున్న పేజ్ని తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది.
నేను తప్పు చేశాను.. అయిన ఏ పర్లేదు అని పోస్ట్‌పై కామెంట్ పెట్టింది శిల్పా. రాజ్‌కుంద్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న శిల్పాశెట్టి ఆయన చేసిన తప్పుల వలన ఈమె విమర్శల పాలైంది. ఒకప్పుడు అగ్ర హీరోయిన్గా ఉన్న శిల్పా పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించి టీవీ షోస్ లేదంటే సోషల్ మీడియాతో సందడి చేస్తుంది.