Shivathmika | టాలీవుడ్లో యాంగ్రీ యంగ్‌మెన్‌గా అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు రాజశేఖర్. ఒకప్పుడు ఆయనకి ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోలీస్ పాత్రలకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు. అల్లరి ప్రియుడిగా లవర్‌బాయ్ ఇమేజ్ ని, మా అన్నయ్యగా ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రాజశేఖర్ ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. తన సహ నటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజశేఖర్ కి శివాత్మిక, శివానీలు సంతానం. వారిద్దరు కూడా ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్స్‌గా అలరించారు. అయితే అనుకున్న స్థాయిలో వారికి అవకాశాలు దక్కలేదు.
రాజశేఖర్, జీవితల కుమార్తెగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన యువ నటి శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినీ పరిశ్రమలో టాలెంట్ కంటే సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువగా చూసే పరిస్థితి ఉందని షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలెంట్ కన్నా సోషల్ మీడియా ఫాలోవర్లకే ప్రాధాన్యత పెరిగిపోయిందని, దాంతో తను కొన్ని మంచి అవకాశాలు కోల్పోయానని వెల్లడించారు. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తక్కువగా ఉన్నారనే కారణంతో కొన్ని సినిమా ఆఫర్లు కూడా చేజారిపోయాయి. నా స్థానంలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్నవారిని తీసుకున్నారు అని శివాత్మిక చెప్పుకొచ్చింది. అయితే ఈ పరిస్థితి వలన ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవాలంటూ మేనేజర్లు, ఏజెంట్ల నుంచి నాపై ఒత్తిడి ఉండేదని తెలియజేసింది శివాత్మిక.
నేను నటిని, కంటెంట్ క్రియేటర్‌ని కాదు కదా, నా నటనతో నన్ను గుర్తించాలి కాని సోషల్ మీడియాలోని అంకెల ఆధారంగా కాద కదా అంటూ తన ఆవేదనను వ్యక్తం చేసింది శివాత్మిక. తెలుగులో ‘రంగమార్తాండ’ తర్వాత శివాత్మిక ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదు. 2019లో వచ్చిన ‘దొరసాని’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక, తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాకుగాను సైమా ఉత్తమ నూతన నటి అవార్డు కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత ‘పంచతంత్రం’, ‘రంగమార్తాండ’ వంటి సినిమాలతో పాటు, తమిళంలో ‘ఆనందం విలయదుం వీడు’, ‘నితమ్ ఒరు వానం’ వంటి చిత్రాల్లోనూ నటించారు. గ్లామర్ పాత్రల కంటే నటనకు ఆస్కారమున్న పాత్రలనే ఎంచుకుంటూ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకోవాలన్నదే ఆమె లక్ష్యం.