Kamal Haasan | తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్‌పై తనకున్న అపారమైన అభిమానాన్ని, గౌరవాన్ని తాజాగా వెల్లడించారు కన్నడ అగ్ర నటుడు శివరాజ్ కుమార్. ఇటీవల చెన్నైలో జరిగిన కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో ఈవెంట్లో పాల్గొన్న శివరాజ్ కుమార్, తన అభిమాన నటుడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. లోకనాయకుడిని కౌగిలించుకున్న తర్వాత మూడు రోజుల వరకు స్నానం చేయలేదని తెలిపాడు.
ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఒకసారి కమల్ సర్ మా ఇంటికి వచ్చారు. నాన్నగారితో మాట్లాడుతుంటే నేను పక్కన నిలబడి ఆయన్ని చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన నన్ను చూసి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఆయన్ని కౌగిలించుకోవచ్చా అని అడిగాను, ఆయన నవ్వుతూ సరే అన్నారు. ఆ తర్వాత నేను మూడు రోజుల వరకు స్నానం చేయలేదు. ఆయన వాసన నాపై అలాగే ఉండాలని నేను కోరుకున్నాను. ఆయనంటే నాకు అంత అభిమానం. అలాగే తాను క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో కమల్ హాసన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తనకు తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్‌తో మాట్లాడినట్లు అనిపించిందని శివరాజ్ కుమార్ వెల్లడించారు.