కన్నడ అగ్రహీరో శివరాజ్‌కుమార్ నటించిన ‘భైరతి రణగల్’ చిత్రం శాండల్‌వుడ్ రికార్డులన్నీ తిరగరాసే పనిలో ఉంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అద్భుతమైన టాక్‌తో భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. శివరాజ్‌కుమార్ ‘మఫ్తీ’కి ప్రీక్వెల్‌గా నర్తన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గీతా పిక్చర్స్ పతాకంపై గీతా శివరాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో తెలుగులో గ్రాండ్ రిలీజ్ కానుంది.
శివరాజ్‌కుమార్ నట విశ్వరూపం ఈ సినిమా అని మేకర్స్ చెబుతున్నారు. నానా పటేకర్, రాహుల్ బోస్, రుక్మిణి వసంత్, అవినాష్, యోగిబాబు, దేవరాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఐ.నవీన్‌కుమార్, సంగీతం: రవి బస్రూర్.