కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించిన చిత్రం ‘వీర చంద్రహాస’. ‘కేజీఎఫ్’ సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమా ద్వారా దర్శకునిగా మారారు. ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ పతాకంపై ఎస్.ఎస్.రాజ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం కన్నడలో భారీ విజయాన్ని సాధించింది.
కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై ఎంవీ రాధాకృష్ణ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 19న విడుదల కానుంది. మహాభారతంలోని అశ్వమేధికపర్వం బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. ఇందులోని యక్షగాన నేపథ్యం ఆడియన్స్‌కి ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
‘మహావతార్ నరసింహ’ తర్వాత హోంబలే వారు సమర్పిస్తున్న సినిమా ఇదని, ఇది కూడా ‘మహావతార్ నరసింహ’ స్థాయి విజయాన్ని అందుకుంటుందని ఎంవీ రాధాకృష్ణ నమ్మకం వ్యక్తం చేశారు. శిధిల్శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: కిరణ్‌కుమార్.ఆర్.