Survivor Documentary | కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ (Shivarajkumar) క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మయామీ క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ కోసం శస్త్రచికిత్స చేయించుకుని విజయవంతంగా ఇండియాకు తిరిగివచ్చాడు శివన్న. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న అనంతరం ఆ మహమ్మారిపై తాను చేసిన పోరాటాన్ని తెలియజేసేలా ఒక డాక్యుమెంటరీని తెరకెక్కిస్తున్నట్లు శివరాజ్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు. ‘సర్వైవర్’ అనే పేరుతో రాబోతున్న ఈ డాక్యుమెంటరీకి ప్రదీప్ కె శాస్త్రి దర్శకత్వం వహిస్తుండగా.. శివరాజ్‌కుమార్ భార్య గీతా శివరాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.
ఇక సినిమాల విషయానికొస్తే సప్త సాగరాలు దాటి చిత్ర దర్శకుడు హేమంత్ రావు దర్శకత్వంలో 666 ఆపరేషన్ థియేటర్ అనే సినిమా చేస్తున్న శివన్న.. తెలుగులో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. రామ్‌చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో ఈ సినిమా రాబోతుంది.
#SURVIVOR – ನಮ್ಮ ⭐ ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ⭐ Documentary!
The story of #Shivanna‘s sporty, warrior spirit..
more updates coming this August! pic.twitter.com/db5PChVYH0— Filmy Feed (@filmy_feed_) July 12, 2025