Global Star Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా నుంచి తాజాగా సాలిడ్ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రంలో నటిస్తున్న కన్నడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ పుట్టినరోజు నేడు కావడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శివన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో శివన్న గౌర్నాయుడు(Gournaidu) పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ భారీ సెట్లో ఈ సినిమా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో భారీ పోరాట సన్నివేశాలతో పాటు, చిత్రంలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Team #Peddi wishes the ‘Karunada Chakravarthy’ @NimmaShivanna Garu a very Happy Birthday ❤🔥
‘GOURNAIDU’ will be regal and explosive on the big screens 💥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026.
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana… pic.twitter.com/xboGBPwx9c
— PEDDI (@PeddiMovieOffl) July 12, 2025