కన్నడనాట శివన్నగా ప్రసిద్ధుడు సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్. హీరోగా తిరుగులేని స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తూనే..మరోవైపు అతిథి పాత్రల్లో కూడా అలరిస్తుంటారాయన. తాజాగా ఆయన రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ఇండియా రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సానా దర్శకుడు. శనివారం శివరాజ్‌కుమార్ పుట్టిన రోజుని పురస్కరించుకొని ‘గౌర్నాయుడు’గా ఆయన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
ఇందులో ఆయన రగ్గ్డ్ లుక్‌తో రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తున్నారు. కథాగమనంలో ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాణ సంస్థ: వృద్ధి సినిమాస్, సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, రచన-దర్శకత్వం: బుచ్చిబాబు సానా.